Wednesday, November 19, 2025

పరకామణి కేసు సాక్షి మృతి.. హత్య కేసుగా నమోదు

Must Read

అనంతపురం జిల్లాలో కలకలం రేపిన సతీష్ కుమార్ మరణం సంచలనం సృష్టించింది. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ మృతి పట్ల గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసు ప్రత్యర్థులు సతీష్‌ను హత్య చేశారని కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గుత్తి జీఆర్పీ పోలీసులు బీఎన్ఎస్ 103(1)(బి) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి అనంతపురంలో సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సమావేశం నిర్వహించారు. పరకామణి కేసుతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు. రైలు కోచ్‌లో ప్రయాణికుల జాబితా సేకరించారు. సతీష్ హత్య జరిగిన సమయంలో ఆయన ప్రయాణించిన ఏ1 కోచ్ సహప్రయాణికుల వివరాలు సేకరించేందుకు రైల్వే పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రయాణ రికార్డులు సీసీటీవీ ఫుటేజ్ రైలు స్టేషన్ల ట్రాకింగ్ డేటా ఆధారంగా నిందితుల జాడ కోసం ఆరా తీస్తున్నారు. పరకామణి కేసు సాక్షి హఠాత్తుగా హత్యకు గురికావడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు చూపుతున్నారు. తన సోదరుడిని పరకామణి కేసు ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్య చేశారని హరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు సంచలనంగా మారగా సీఐడీ పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి పరకామణిలో సొమ్ము అపహరించిన కేసు కీలక సాక్షి సతీష్ ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ సీనియర్ నేత పట్టాభి ఆరోపణలు చేశారు. సతీష్‌ది ముమ్మాటికీ హత్య అని అసలు సతీష్‌కు భయం ఉంటే గతంలో విచారణకు వచ్చేవాడు కాడని ప్రశ్నించారు. సిట్ కార్యాలయానికి సతీష్ చేరితే వారి పాపం పండుతుందని భయపడి అతడిని లేకుండా చేశారని ఆరోపించారు. హత్య కేసుగా నమోదు చేయడం సంచలనం అయింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -