Thursday, September 19, 2024

రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ వారికే?

Nobel Prize For Chemistry

Must Read

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో నోబెల్ మొదటి స్థానంలో ఉంది. ఈ పురస్కార గ్రహీతలకు దక్కే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కాదు. నోబెల్ కోసం వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు పోటీపడతారు. ఈ సంవత్సరం నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం మొదలైంది. ఇప్పటికే వైద్య శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారాలను ప్రకటించారు. ఫిజిక్స్ లో అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈసారి భౌతిక శాస్త్రంలో ముగ్గుర్ని నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తినితో పాటు జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్ కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్ కు ఈ సంవత్సరం నోబెల్ ప్రకటించారు.

ఆటమ్స్ ఎలక్ట్రానిక్స్ డైనమిక్స్ ను స్టడీ చేసినందుకు.. కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్ ను ఉత్పత్తి చేసే రీసెర్చ్ కు గానూ వీరికి ఈ అవార్డును అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి రీసెర్చ్ తో అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్ ను స్టడీ చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని తెలిపింది. ఈ సంవత్సరం మెడిసిన్ లో ఇద్దర్ని నోబెల్ వరించింది. కరోనా వైరస్ పై పోరాటం కోసం సమర్థవంతమైన, శక్తిమంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన సైంటిస్టులు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్ లకు ఈ అవార్డు దక్కింది.

నోబెల్ పురస్కారాల్లో అత్యంత పాపులారిటీ కలిగిన కేటగిరీ రసాయన శాస్త్రమని చెప్పొచ్చు. ప్రతిసారి కెమిస్ట్రీలో ఎవరు అవార్డు గెలుచుకుంటారనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఈసారి కూడా రసాయన శాస్త్రంలో నోబెల్ ను ఎవరు సొంతం చేసుకుంటారనే ఉత్సుకత అందరిలోనూ ఉంది. బుధవారం సాయంత్రం రసాయన శాస్త్రం, గురువారం నాడు సాహిత్యం విభాగాల్లో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి-2023 గ్రహీత పేరు వెల్లడిస్తారు. ఇక, అక్టోబర్ 9న అర్ధశాస్త్రంలో నోబెల్ ఎవరు గెలుపొందారో ప్రకటిస్తారు. ఈ అవార్డులను డిసెంబర్ 10న విన్నర్స్ కు అందజేయనున్నారు. కాగా, ఈసారి కెమిస్ట్రీ విభాగంలో ఎవరు నోబెల్ గెలుస్తారనే దానిపై పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

సింథటిక్ బయోలజీ, డీఎన్ఏ సీక్వెన్సింగ్ లాంటి పరిశోధనలకు నోబెల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు. సింథటిక్ జీనీ సర్క్యూట్స్ పై పనిచేసిన అమెరికాకు చెందిన జేమ్స్ జె కొలిన్స్, మైకేల్ ఎలోవిట్జ్, స్టానిస్ లాస్ కు నోబెల్ వచ్చే ఛాన్స్ గట్టిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. డీఎన్ఏ సీక్వెన్సింగ్ కోసం కలసి పనిచేసిన భారత సంతతికి చెందిన బాలసుబ్రహ్మణియన్, బ్రిటన్ కు చెందిన డేవిడ్ క్లెనెర్మన్ కూడా ఈసారి నోబెల్ దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని టాక్. వీళ్లతో జీనీ మెథడ్స్ కోసం వర్క్ చేసిన జపాన్ కు చెందిన కజునోరి కటవోకా, రష్యన్ వ్లాదిమిర్ టోర్చిలిన్, అమెరికన్ కరెన్ వూలీలు కూడా నోబెల్ రేసులో ఉన్నారని. మరి.. ఈసారి రసాయన శాస్త్రంలో ఎవరికి నోబెల్ వస్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -