Monday, October 20, 2025

నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన!

Must Read

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వానంతో స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏపీలో మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆహ్వానం పంపింది. ఈ పర్యటనలో లోకేష్ వివిధ యూనివర్సిటీలను సందర్శించి, అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేయనున్నారు. అలాగే, నవంబర్ 14-15న విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కోసం రోడ్ షోలో పాల్గొని, పెట్టుబడులను ఆకర్షించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖలో కీలక మార్పులు చేసిన లోకేష్, ఈ పర్యటన తర్వాత మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -