Wednesday, November 19, 2025

రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి సరెండర్

Must Read

వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో మిథున్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకొని, అక్కడ నుంచి వాహనంలో జైలుకు వెళతారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ఆయనను హాజరుపరుస్తారు. సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -