తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ట కేటీఆర్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి ఏసీబీ విచారణలో భాగంగా తనతో న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది.