Monday, January 26, 2026

షూటింగ్‌లో ప్రమాదం.. పాపులర్ స్టంట్ మాస్టర్ మృతి

Must Read

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పేరొందిన స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఓ కొత్త తమిళ సినిమా కోసం యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా అప్రతిష్టితంగా సెట్‌పై నుంచి కింద పడిపోయిన రాజు, తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రాజు గత రెండు దశాబ్దాలుగా కోలీవుడ్‌లో యాక్షన్ ఎక్స్ కొరియో గ్రాఫర్‌గా పని చేస్తూ ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు పని చేశారు. అతని స్టంట్లు సినిమాల్లో రియలిస్టిక్‌గా ఉండే విధంగా రూపొందించడం ప్రత్యేకత. మాస్ హీరోలతో పాటు యువ హీరోల సినిమాలకు కూడా పని చేశారు. ఇటీవల రాజు ఓ యాక్షన్ డ్రామా చిత్రానికి స్టంట్ మాస్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే సినిమాకు సంబంధించిన షూటింగ్ సందర్భంగా ఈ విషాద ఘటన జరిగింది. స్టంట్ మాస్టర్ రాజు మృతి పట్ల చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. “ఇప్పటిదాకా చాలా రిస్కీ స్టంట్లు కంపోజ్ చేసినా, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు. ఇదీ చివరి యాక్షన్ అవుతుందని ఎవరు ఊహించగలరు?” అంటూ పలువురు సహచరులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. రాజు ఆకస్మిక మృతి కోలీవుడ్‌కు తీరనిలోటుగా సినీ ప్రముఖులు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -