భారత పేసర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు షాకిచ్చింద. తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని షమీని కోర్టు ఆదేశించింది. అయితే షమీ స్థాయికి ఈ భరణం చాలా తక్కువ అని, తాము రూ.10 లక్షల వరకు కోరామని షమీ మాజీ భార్య హసీన్ జహాన్ వ్యాఖ్యానించారు. భార్య హసీన్ జహాన్ కోసం నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె కోసం నెలకు రూ.2.5 లక్షలు షమీ ఇవ్వాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. 2018లో మహమ్మద్ షమీ, హసీన్ జహాన్ విడాకులు తీసుకున్నారు. ఏడేళ్ల కిందటే జహాన్ అతడి నుంచి నెలకు రూ.10 లక్షల వరకు ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచి అతడి ఆదాయం, ఖర్చులు కూడా పెరిగాయి పేర్కొన్నారు. షమీ ఎలా తన జీవితాన్ని గడుపుతున్నాడో.. తాను, తన కుమార్తె కూడా అదే స్థాయిని కొనసాగించే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారంపై షమీ స్పందించలేదు. ఈ భరణానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.