Sunday, March 29, 2026

ఇంధన ధరలపై చర్యలు తీసుకోవాలి – కిషన్ రెడ్డి

Must Read

ఇజ్రాయెల్​, అమెరికా – ఇరాన్​ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా రాష్ట్రాలు కూడా వ్యాట్​ను తగ్గించుకోవాలి అని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్​ నిల్వలపై తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు హైదరాబాద్​లోని సీజీఐ టవర్స్​లో కిషన్​రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ గ్యాస్ సమస్యలపై వస్తున్న వదంతులను ప్రస్థావించారు.

వ్యాట్​ ఎందుకు తగ్గించరు : పెట్రోలు, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం వ్యాట్​ విధిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. గత పన్నెండేళ్లగా ఇది 35.20 శాతంగా ఉంటోందని తెలిపారు. గతంలో పాలించిన కేసీఆర్​ ప్రజాపాలన అంటూ డప్పు కొట్టుకుంటున్న కాంగ్రెస్​ పార్టీ దీనిలో ఒక్కపైసా కూడా వ్యాట్​ను తగ్గించలేదని వెల్లడించారు. మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​లో 31 శాతంగా విధిస్తుండగా, మహారాష్ట్రలో 26 శాతం, కర్ణాటకలో 29 శాతంగా ఉన్నాయని ప్రస్థావించారు. అయితే తెలంగాణలో మాత్రం ఎందుకని 35.20 శాతం విధిస్తున్నారు? దీనిని ఎందు తగ్గించండం లేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -