తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శుక్రవారం కామారెడ్డిలో రైలు రోకో నిర్వహించారు. తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి రైల్వే ట్రాక్‌పై బైఠాయించిన కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా పంచాయతీ ఎన్నికలకు కేవలం 17 శాతం రిజర్వేషన్లతో వెళ్తోందని కవిత ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయి’’ అని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనలో కవిత చేతికి స్వల్ప గాయం కాగా, ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

