హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ గ్రూపులు పిస్తాహౌస్, మేహిఫిల్, షాగ్‌హౌస్‌పై ఆదాయపన్ను శాఖ సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ మూడు గ్రూపులూ ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఐటీ రిటర్న్స్‌లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పిస్తాహౌస్ యజమానులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ నివాసాలతో పాటు వారి ఉద్యోగుల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య భారీ తేడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది.

