అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో సీపీఐ (మావోయిస్టు) పోలిట్‌బ్యురో సభ్యుడు, బస్తర్ డివిజన్ కమాండర్ హిడ్మా కూడా ఉన్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ధృవీకరించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంకా సెర్చ్ కొనసాగిస్తున్నాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

