Monday, January 26, 2026

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద

Must Read
  • 69 గేట్లు ఎత్తి నీటి విడుద‌ల‌
  • కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితి మరింత తీవ్రతరం అవుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి సుమారు 3.03 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతుండగా, అధికారులు 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2.97 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ నుండి ప్రవాహం మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు నుంచి మూడు గంటల్లో మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించే అవకాశం ఉంది. నదీ తీరప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాల‌ని సూచించారు. నది పరివాహక పొలాల్లోకి రైతులు వెళ్లరాదని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ఇప్పటికే అలర్ట్‌ మోడ్‌లోకి వెళ్లాయి.
  • వాతావరణ శాఖ హెచ్చరిక:
  • తదుపరి 24 గంటల్లో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. విద్యుత్ తీగల సమీపంలోకి వెళ్లకూడదు. పిల్లలు, వృద్ధులు నది పరిసరాలకు వెళ్లకుండా చూడాలి. అవసరమైతే సహాయక కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.మొత్తంగా, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం వేగంగా పెరుగుతున్నందున, కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం పునరుద్ఘాటిస్తోంది.
- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -