బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం కలకలం రేపింది.ఈ రోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకులు ఆయనకు ఫోన్ చేశారు. ఈ బెదిరింపు కాల్ గురించి డీజీపీకి, మెదక్ ఎస్పీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కాగా ఈ బెదిరింపులు పీపుల్స్‌వార్ మావోయిస్టు పేరుతో వచ్చినట్లు సమాచారం. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టుగా చెప్పుకున్నాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి రఘునందన్‌రావు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది.