Saturday, August 30, 2025

గాజాలో కరువు తీవ్రతపై హెచ్చరికలు జారీ

Must Read

గాజా యుద్ధం ప్రభావంతో అక్కడి ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మానవతా సహాయం కోసం ఏర్పడిన తొక్కిసలాట విషాదానికి దారితీసింది. గాజాలోని జికిమ్ క్రాసింగ్ వద్ద మానవతా సహాయం చేరుకున్న సమయంలో ఆహారం కోసం భారీగా జనం ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో 48 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాజా సిటీ షిఫా హాస్పిటల్ అధికారులు ఈ మరణాలను ధృవీకరించారు. సహాయ బృందం తీసుకొచ్చిన పిండి సంచులు కోసం జనాలు పోటీపడటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ పోలీసులు కాల్పులు జరిపారన్న ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక దాడులు, కఠిన దిగ్బంధనం కారణంగా గాజాలో ఇప్పటికే ఆహార కొరత తీవ్రమైంది. ఈ ఘటనతో పరిస్థితి మరింత విషమించింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్‌ (ఐపీసీ) గాజాలో కరువు తీవ్రతపై హెచ్చరికలు జారీ చేసింది. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రాణ నష్టాలు తప్పవని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, గాజాకు చేరిన మానవతా సహాయం పైన కూడా పరిమితులు అమలవుతున్నాయి. యూఎన్ ప్రకారం ఇప్పటి వరకు 600 ట్రక్కుల మానవతా సహాయం చేరగా, వాటిలో కేవలం 220 ట్రక్కులకే అనుమతి ఇచ్చారు. సహాయాన్ని పొందేందుకు జరిగే తొక్కిసలాటల్లో ఇప్పటి వరకు వెయ్యిమంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అంతర్జాతీయ మానవతా సంస్థలు వెల్లడించాయి. గాజాలో పరిస్థితులు మరింత విషమించకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలని మానవతా సంస్థలు కోరుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -