Saturday, August 30, 2025

గిరిజన ప్రాంతాల్లో పాఠశాల భవనాలకు నిధులు – మంత్రి నారా లోకేష్

Must Read

గిరిజన ప్రాంతాల్లో వంద‌ శాతం శాశ్వత పాఠశాల భవనాల నిర్మాణం మా సంకల్పమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ దిశగా ముఖ్యమైన అడుగుగా, మారుమూల ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.45.02 కోట్లు మంజూరు చేస్తూ జీ.ఓ నంబర్ 264ను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. లోకేష్ వివరాల ప్రకారం, ఇప్పటి వరకు భవనాలు లేని లేదా పూర్తిగా కొత్త భవనాలు అవసరమైన 286 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం చేపట్టనున్నారు. అదనంగా, 85 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతులు చేయడానికి కూడా ఈ నిధులు కేటాయించారు. ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. “గిరిజన ప్రాంతాల్లో విద్యా సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంద‌న్నారు. పాఠశాలలు కేవలం చదువుల కేంద్రాలు మాత్రమే కాదు, భవిష్యత్ తరాల భవిష్యత్తును మలిచే ప్రేరణ కేంద్రాల‌ని పేర్కొన్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో విద్యా మౌలిక వసతుల అభివృద్ధిని అత్యున్నత ప్రాధాన్యతగా చూస్తున్నాం అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ ప్రాజెక్టులు పూర్తయితే, గిరిజన విద్యార్థులకు సౌకర్యవంతమైన, శాశ్వత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల చదువు వాతావరణం మెరుగుపడటంతో పాటు, హాజరు శాతం మరియు ఫలితాల స్థాయి కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -