Saturday, August 30, 2025

బెట్టింగ్‌ యాప్‌ కేసు… ఈడీ విచారణకు ప్రకాష్‌రాజ్

Must Read

టాలీవుడ్ న‌టుల‌పై బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ బుధ‌వారం విచార‌ణ‌కు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి ఆయన తన లాయర్‌తో కలిసి వచ్చారు. విచారణలో భాగంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ ప్రకాష్‌రాజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసింది. అక్రమంగా నడుస్తున్న బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినట్లు ఆరోపణలపై ఇప్పటికే అనేకమంది సినీ నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్రీముఖి తదితరులున్నారు. మొత్తంగా టాలీవుడ్ నుంచి 36 మంది సెలబ్రిటీలు ఈ విచారణలో భాగం కానున్నార‌ని అధికారులు వెల్లడించారు. వీరు జంగ్లీ రమ్మీ, జీత్‌విన్‌, లోటస్365, పారిమాచ్‌ వంటి బెట్టింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స‌ద‌రు న‌టీన‌టులు, యాంక‌ర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వేర్వేరు తేదీల్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. బెట్టింగ్ యాప్‌ల వ్య‌వ‌హారంతో ఎంతోమంది యువ‌కులు ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డంతో పాటు, చాలా మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డ్డారు. దీంతో ఈడీ విచార‌ణ‌ రాష్ట్ర‌వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -