ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నేతలను టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. బీసీ నాయకుడు జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలు లోకేశ్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీలు ఉన్నారని ఆయన ఆరోపించారు. జోగి రమేష్ సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తే, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, పోలీసులు కూటమి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అవినాష్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఈ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటుందని తెలిపారు.