Monday, October 20, 2025

రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్‌ నమోదు

Must Read

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక చర్య తీసుకుంది. ఆయనపై మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, మొత్తం రూ. 37.64 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను కూడా జప్తు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు వెనుక ఉన్న నేపథ్యం 2018లో హర్యానా రాష్ట్రం గుర్‌గావ్‌కు చేరుతుంది. అక్కడ అక్రమంగా కమర్షియల్ లైసెన్స్‌ను వాడి భూమిని కొనుగోలు చేసినట్టుగా రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ అంశంపై ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాబర్ట్ వాద్రా అక్రమ ఆస్తుల కొనుగోలు కోసం నిధుల మళ్లింపుకు పాల్పడ్డారని ఈడీ తమ నివేదికలో పేర్కొంది. కేసు మరింత విచారణకు రానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -