ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల క్షేత్రానికి వెళ్లనున్నారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక భక్తుడు స్వామివారికి సమర్పించనున్న 121 కిలోల బంగారు ఆభరణాలతో పాటు కిరీటం మరియు పద్మపాదాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా స్వీకరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
తిరుమల పర్యటన మరియు శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పయనమవుతారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని పర్యటన ముగించుకున్న అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటల సమయానికి తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.

