టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏసీ సీఎం చంద్రబాబు ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను స్ఫూర్తిగా తీసుకునే ర్యాపిడో ఆవిష్కరణ చేశారంటూ వ్యాఖ్యానించారు. ర్యాపిడో వ్యవస్థాపకుల్లో ఒకరైన నిజామాబాద్‌కు చెందిన పవన్ గుంటూరు జిల్లా వాసి అని చెప్పుకొచ్చారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఐఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ర్యాపిడో అందరూ చూస్తున్నారని, ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తే అని వ్యాఖ్యానించారు. సదరు వ్యక్తి తండ్రి నిజామాబాద్‌కు వలస వెళ్లిపోయారని, గతంలో టీడీపీ కార్యకర్తగా ఉండేవాడని చెప్పారు. తాను చెప్పిన విషయాలన్నీ వినేవాడని చెప్పారు. ఆయన కొడుకు ఐఐటీ చేశాడని, ఆయన చెప్పేవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ అందరూ చూశారన్నారు. అతను చేసిన పని చూస్తే.. దేశంలో ఉండే ఆటోలుగానీ మోటర్ బైక్‌లు గానీ, ఇవన్నీ ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేసి, ఒక ప్లాట్‌ఫాం కిందకు తీసుకొచ్చాడని కొనిడయాడారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.