తిరుమల ఆలయ పరకామణి అక్రమాల కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం హాజరయ్యారు. గంటన్నర పాటు జరిగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి, ‘‘పరకామణి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. దోషులు ఎవరైనా నిగ్గు తేల్చి కోర్టు ద్వారా శిక్ష పడేలా చూడాలి. లడ్డూ కల్తీ, పరకామణి వంటి మనోభావాల సమస్యలను రాజకీయ వివాదాలుగా మార్చారు. తప్పు చేసిన వారిని ఎవరైనా శిక్షించాలనే మా డిమాండ్’’ అని స్పష్టం చేశారు.

