Monday, October 20, 2025

పులివెందులలో వైసీపీ,టీడీపీ నేతలపై కేసులు న‌మోదు

Must Read

కడప జిల్లా పులివెందుల మండలంలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు కేసుల వరకు వెళ్లాయి. ఇటీవల నల్లగొండ వారి పల్లెలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకుడు వేముల రాము ఇచ్చిన ఫిర్యాదులో, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కలిసి తనపై టీడీపీ కార్యకర్తలు కార్లతో ఢీకొని, అనంతరం కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పులివెందుల పోలీసులు, టీడీపీ నేతలు 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీడీపీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డితో పాటు ఇతర 24 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో నాన్-బెయిలబుల్ సెక్షన్లు కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఇక మరోవైపు, వైసీపీ నేతలపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ధనుంజయ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదులో, అదే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు వేముల రాము, హేమాద్రి తనను కులపరంగా దూషించారనే ఆరోపణలతో కేసు నమోదు అయింది. ఇవన్నీ కొనసాగుతుండగానే, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కూడా మరొక కేసు నమోదు అయింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఇంకా వేరే 8 మంది వైసీపీ నాయకులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదులో, ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగానే అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -