Saturday, August 30, 2025

స్టంట్ మ్యాన్‌లపై అక్షయ్ కుమార్ ఉదార‌త‌

Must Read

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తమిళ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో స్టంట్ మాస్టర్ రాజు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన అక్షయ్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ వార్త విన్న వెంటనే స్పందించిన అక్షయ్, చిత్ర పరిశ్రమలో స్టంట్ల కోసం పని చేస్తున్న వ్యక్తుల భద్రతపై దృష్టి పెట్టారు. స్టంట్లు చేయడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకున్న అక్షయ్ కుమార్, దాదాపు 650 మంది స్టంట్ ఆర్టిస్ట్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే చర్యలు చేపట్టారు. ఎంతోమంది స్టంట్ మ్యాన్‌లు నిర్భయంగా, అచంచలంగా హీరోల కోసం సాహసకృత్యాలు చేస్తుంటారు. కానీ, వారికి అవసరమైన భద్రతా చర్యలు, ఆర్థిక రక్షణ ఉండకపోవడం ఎంతో బాధాకరమని అక్షయ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ముందు కూడా సినిమాల్లోని స్టంట్ ఆర్టిస్ట్‌ల పట్ల త‌న సానుభూతి చూపించిన అక్షయ్, ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసిపెట్టి ఒక మంచి ఉదాహరణగా నిలిచారు. సినీ పరిశ్రమలో పనిచేసే స్టంట్ మాస్ట‌ర్ల‌కు ఇది ఎంతో సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని సినిమా ప్రేమికులు భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -