విశాఖలో గూగూల్ సంస్థ ద్వారా లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన వాదనలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కుండబద్దలు కొట్టారు. మీడియాతో మాట్లాడుతూ, “నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. గూగూల్ డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. ఇది లక్షల ఉద్యోగాలు తెచ్చే సంస్థ కాదు. కేవలం 2,000-3,000 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఉద్యోగాల సంఖ్య సమస్య కాదు, నిజాయితీ ముఖ్యం,” అని స్పష్టం చేశారు. అలాగే, ఉచిత బస్సు ప్రయాణ పథకంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మహిళల డామినేషన్ ఎక్కువై, టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్సుల నుంచి దించేస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులే ఈ విషయం చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి,” అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలోని లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి.