Tuesday, October 21, 2025

నటుడు శ్రీకాంత్‌పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు!

Must Read

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఆయన ఫిర్యాదు చేసి, శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు, ఘర్షణలు సృష్టించవచ్చని హెచ్చరించారు. పెద్ద హీరోలు సైతం ఈ అంశంపై స్పందించాలని కోరారు. మా అసోసియేషన్ చర్యలు తీసుకోకపోతే, తాము మరింత కఠినమైన చర్యలకు పూనుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, మా జనరల్ సెక్రటరీ శివ బాలాజీ స్పందిస్తూ.. తమ వద్ద డిసిప్లినరీ కమిటీ ఉందని, ఈ విషయాన్ని చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో మీటింగ్ నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -