Tuesday, October 21, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లోకి బాలకృష్ణ!

Must Read

తెలుగు చిత్రసీమకు నటసింహంగా పేరు గాంచిన నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌ ఆధారంగా ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదు చేశారు. హీరోగా 50 ఏళ్లపాటు నిరంతరం వెలుగొందిన విశిష్టమైన ప్రయాణాన్ని గుర్తిస్తూ ఈ గుర్తింపుని అందజేశారు. ప్రపంచ సినీ చరిత్రలో కూడా అత్యంత అరుదైన ఈ మైలురాయిని బాలకృష్ణ అందుకోవడం విశేషం. క్రమం తప్పకుండా విజయవంతమైన చిత్రాలు అందిస్తూ, రాజకీయరంగంలోనూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఆయనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అదేవిధంగా, వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా 15 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా ఈ గుర్తింపుని ప్రకటించారు. ఆగస్టు 30న హైదరాబాద్‌లో బాలకృష్ణకు స్వయంగా ఈ అవార్డును అందజేయనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -