ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు మరియు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి మొత్తం 88 వేల 392 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చే 18 ప్రాజెక్టుల ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఆరు కీలక రంగాలలో రానున్న ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని 54 వేల 210 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమ విస్తరణకు 19 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు అనకాపల్లి జిల్లా తూటిపాలలో 200 ఎకరాల్లో 47 వేల 9 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది. అలాగే రాజధాని అమరావతి పరిధిలోని 26 గ్రామాల్లో రహదారులు డ్రెయిన్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 1921 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

