Monday, March 23, 2026

నాపై జ‌రిగిన దాడిపై విచార‌ణ చేప‌ట్టండి – అంబ‌టి రాంబాబు

Must Read

ఆంధ్రప్రదేశ్‌ మాజీమంత్రి అంబటి రాంబాబు ఇవాళ (మార్చి 23) గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. తన ఇంటిపై దాడి, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో హింసించడంపై విచారణ చేపట్టాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు.‘నా ఇంటిపై దాడి ఘటనలో విచారణ అధికారిని మార్చాలి. నల్లపాడు పీఎస్‌లో టార్చర్‌ వ్యవహారంలో పూర్తి విచారణ చేయాలి. మా ఇంటిపై ఏడున్నర గంటలపాటు దాడి చేసి హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దాడికి పోలీసులు సహకరించారు. ఇలాంటి ఘటనలో పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేయాలి. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు దారుణంగా వ్యవహరించారు. న్యాయం జరగకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తా. దాడులకు పాల్పడినవారిని, ప్రేరేపించినవారిని వదిలేదే లేదు’ అని అంబటి రాంబాబు అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు

గత కొన్ని వారాలుగా యుద్ధ మేఘాలతో అట్టుడికిపోతున్న మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా శాంతి గాలులు వీస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులతో ప్రపంచం మూడో ప్రపంచ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -