తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.‘తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు.’ అని నివేదికలో వెల్లడించారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడుకు కలెక్టర్ ఫిర్యాదు చేశారు.