Saturday, August 30, 2025

క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం

Must Read

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర తూర్పు తీరంలో శనివారం ఉదయం భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదు అయ్యిందని యూరోపియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంపం భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీంతో తీరప్రాంత పట్టణాలు, నగరాల్లో కంపనలు స్పష్టంగా అనుభవించబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, చిన్న కట్టడాలు దెబ్బతిన్నాయని ప్రాథమిక సమాచారం వెలువడింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం అధికారికంగా నిర్ధారించబడలేదు. అకస్మాత్తుగా వచ్చిన ప్రకంపనలతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. స్థానిక అధికారులు అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేసే పనులు జరుగుతున్నాయి. క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గతంలో ఈ తీరప్రాంతాన్ని భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తించిన విషయం గమనార్హం. ఇదే విషయాన్ని ఇప్పుడు మరొకసారి ఈ ప్రకంపనలు నిరూపించాయి. ఇక జియోసైన్స్ ఆస్ట్రేలియా నేషనల్ భూకంప హెచ్చరిక కేంద్రం ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ, మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -