తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లకు చేరువలో ఉంది. ఇటీవల రేవంత్ సర్కార్ కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. జనాభా మూడు కోట్ల 70 లక్షలు దాటింది. ఇప్పటివరకు 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మంది సర్వేలో పాల్గొన్నారు. 16 లక్షల మందికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. వీరిలో బీసీ జనాభా 46.25%, ఓసీలు 15.79%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లింలు 12.56 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది.