Wednesday, September 3, 2025

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి!

Must Read

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో మంగళవారం రాత్రి ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వెట్టాలో షావానీ స్టేడియంలో బలోచిస్థాన్ నేషనల్ పార్టీ నిర్వహించిన సమావేశం సందర్భంగా ఈ దాడి జరిగింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు హాజరైన ఈ కార్యక్రమంలో, పార్కింగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి బాంబు పేల్చుకున్నాడు. దీంతో సంఘటన స్థలంలోనే పలువురు మృతి చెందగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించగా, భద్రతా దళాలు స్టేడియం పరిసరాలను పూర్తిగా ముట్టడి చేసి తనిఖీలు చేపట్టాయి. ఈ దాడిలో బీఎన్‌పీ నేత, మాజీ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్ కుమారుడు అక్తర్ మెంగల్ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదని సమాచారం.

- Advertisement -
- Advertisement -
Latest News

చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలిసిపోతోంది: జగన్‌

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం యథేచ్ఛగా నాశనం అవుతోందని, రైతుల సమస్యలకు పరిష్కారం చూపే దిక్కు లేదని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -