Wednesday, November 19, 2025

టీడీపీ హ‌యాంలో 108, 104 సేవలు దుర్వినియోగం

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక లాభాల కోసం దుర్వినియోగం చేస్తోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సేవల ఒప్పందాన్ని టీడీపీ నాయకుడితో సంబంధం ఉన్న సంస్థకు కట్టబెట్టడం ద్వారా నెలకు రూ.31 కోట్ల ఆదాయం పార్టీకి సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి విడదల రజినీ ఆరోపించారు. ఈ వ్యవహారం రూ. 2,000 కోట్ల కుంభకోణంగా మారిందని ఆమె పేర్కొన్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 సేవలను బలోపేతం చేసినట్లు రజినీ తెలిపారు. కొత్త అంబులెన్సులను సమకూర్చడం, సాంకేతికతను ఆధునీకరించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు త్వరిత వైద్య సహాయం అందించినట్లు ఆమె వివరించారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ఈ సేవలను వాణిజ్య లాభాల కోసం ఉపయోగిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ సేవల ఒప్పందం భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇవ్వబడింద‌న్నారు. ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ దొనేపూడి టీడీపీ నాయకుడు, మాజీ టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు కావడం గమనార్హమ‌ని వ్యాఖ్యానించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం కేవలం రూ. 5.52 కోట్లు మాత్రమే కాగా, ఈ సేవలను నిర్వహించడానికి సరిపడా అనుభవం లేని సంస్థకు ఒప్పందం ఎలా దక్కిందని ప్రశ్నలు వస్తున్నాయి. జీవీకే ఈఎంఆర్‌ఐ వంటి నిరూపిత సంస్థలను పక్కనపెట్టి ఈ సంస్థను ఎంచుకోవడం వెనుక టీడీపీ రాజకీయ లబ్ధి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం భవ్య హెల్త్ సర్వీసెస్‌కు ఎటువంటి ఆర్థిక రిస్క్ లేకుండా, తక్కువ పెట్టుబడితో సేవలు అందించే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అంతేకాక, సేవలకు సంబంధించిన చెల్లింపులు ముందుగానే అందజేయడం, ఒప్పందంలో శిక్షణ నిబంధనలు సరళంగా ఉండటం వంటి వాటితో ఈ సంస్థకు గణనీయమైన ప్రయోజనం కల్పించారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా నెలకు రూ.31 కోట్లు, ఏటా 3 శాతం పెరుగుదలతో టీడీపీకి నిధులు సమకూర్చే ఉద్దేశం ఉందని రజినీ ఆరోపించారు. “ఇది ఆరోగ్య సేవలు అందించడం కాదు, రూ. 2,000 కోట్ల కుంభకోణం” అని రజినీ తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఈ సేవలను రాజకీయ, ఆర్థిక లాభాల కోసం ఉపయోగించడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై టీడీపీ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -