Sunday, January 5, 2025

హాస్టల్‌లో బాత్‌రూమ్ వీడియోలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

Must Read

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్‌ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై చేతి గుర్తులు లభించాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులు కూడా లభించాయి. రాత్రి ఒంటి గంటకు ఓ విద్యార్థిని కెమెరాను గుర్తించింది. రెండు మూడు చోట్ల కెమెరాలు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజ్ ఎదుట విద్యార్థినులు నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మహిళా కమిషన్‌ను ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

చైనాలో వైరస్ కలకలం.. భారత్ కీలక ఆదేశాలు

చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. ఆ దేశంలో HMPV అనే వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ బాధిత రోగులతో చైనా ఆస్పత్రులు అన్ని...
- Advertisement -

More Articles Like This

- Advertisement -