BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశముందని వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిందే. BGT సిరీస్‌లో 1-2తో IND వెనుకబడి ఉంది.