Monday, January 26, 2026

వైఎస్ కుటుంబంతో విభేదాలు లేవు: విజయసాయిరెడ్డి

Must Read

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం. నాకు వైఎస్ జగన్ కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవు, రావు. జగన్‌తో మాట్లాడాకే రాజీనామా చేశాను. నాలాంటి వాళ్లు వైసీపీ నుంచి వెయ్యి మంది పోయినా జగన్‌కు ప్రజాదరణ తగ్గదు. కాకినాడ పోర్టుకు, నా రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదు.’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

తన రాజకీయ జీవితంలో ఏ రోజు అబద్దాలు చెప్పలేదని.. చెప్పను కూడా అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఒకవేళ తాను అబద్దాలు చెప్తాను అని మీరు అనుకుంటూ అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ ఎమోషనల్‌ అయ్యారు. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. తన పిల్లల సాక్షిగా కాకినాడ పోర్ట్ వ్యవహారంతో ఏం సంబంధ లేదన్నారు. ఏపీ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి రాజీనామా నిర్ణయం సంచలనం రేపుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -