రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్ కొత్తగా పాస్ బుక్ పొందిన వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారికి కూడా రైతుభరోసా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సైట్‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్‌లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.