రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లూ లేవని చెప్పారు. అయితే, రాజీనామా లేఖ సమర్పణకు ముందు విజయసాయితో వైసీపీ ఎంపీ గురుమూర్తి చర్చలు జరిపారు. అయినా వెనక్కి తగ్గని విజయసాయి.. రాజ్యసభకు చేరుకుని చైర్మన్ ధన్ ఖడ్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.