ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్ ముస్తాబవుతోంది. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించినట్లు తెలిపింది. ఇందులో ప్రతి 15 నిమిషాలకోసారి వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా రోజుకు రెండు సార్లు వాతావరణ సూచనలను జారీ చేస్తామని వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే.