Saturday, August 30, 2025

మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం

Must Read

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుంభమేళా సెక్టార్-5లోని ఓ గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంలో షాపులోని టెంట్లు, కొన్ని వస్తువులు దగ్ధమయ్యాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -