Thursday, April 17, 2025

మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం

Must Read

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి నటుడు మంచు మోహన్ బాబు, మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణకు రావాలని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో సోమవారం మనోజ్ కీలక డాక్యుమెంట్స్ తీసుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు.

రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ ముందు మంచు మోహన్ బాబు, మనోజ్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరి విచారణ సాగింది. మెజిస్ట్రేట్‌కు మోహన్ బాబు, మనోజ్ పూర్తి వివరాలను సమర్పించారు. బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మెజిస్ట్రేట్ ముందు మోహన్ బాబు, మనోజ్ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. వచ్చేవారం మరోసారి విచారణకు రావాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఇటీవలే మంచు విష్ణు, మనోజ్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -