Friday, November 22, 2024

భాగ్యనగరంలో డీజేలపై నిషేధం

Must Read

హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున్న రూల్స్ బ్రేక్ చేశారని, ఈసారి మరింత శృతిమించి వ్యవహరించారని సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజేలపై నిషేధం విధించామన్నారు. డీజేలు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
డీజేల వ్యాపారంపై కోలుకోలేని దెబ్బ..
నగరంలో వేలాది మంది యువకులు డీజేలపై ఆధారపడి జీవిస్తున్నారు. సొంతంగా డీజే షాపులు పెట్టి పండుగలు, పెండ్లిళ్లలో సేవలందిస్తున్నారు. డీజేలపై నిషేధం వల్ల వీరి వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా, డీజే శబ్ధాల వల్ల పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని సీవీ ఆనందం తెలిపారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్పీకర్ దే తుది నిర్ణయం: హైకోర్టు సంచలన తీర్పు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక...
- Advertisement -

More Articles Like This

- Advertisement -