చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. ఆ దేశంలో HMPV అనే వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ బాధిత రోగులతో చైనా ఆస్పత్రులు అన్ని నిండిపోయాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. అయితే శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఏజెన్సీలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు చైనాలో సీజనల్ ఇన్ ఫ్లుఎంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్.. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు తీవ్రమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.