TG: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో హైదరాబాద్ నుంచి కొత్తగా సుమారు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,39,506 రేషన్‌కార్డులు ఉండగా 15 నుంచి 20శాతం పెరుగుదల ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వారం రోజుల్లోగా కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు.