బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో అతనికి రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. ఈ పదవి మరో రెండేండ్లు ఉన్నప్పటికీ.. ఆర్.కృష్ణయ్య రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేశారు.
టచ్ లోకి కాంగ్రెస్ నేతలు!
ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అతనితో చర్చలు జరుపుతున్నారు. బుధవారం కృష్ణయ్య నివాసానికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. ఇందుకు ఆర్. కృష్ణయ్య త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తాని చెప్పారు. ఇదిలా ఉండగా, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే తాను రాజ్యసభకు రాజీనామా చేశానని ఆర్. కృష్ణయ్య చెబుతున్నారు.