Wednesday, February 5, 2025

సోనియా గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

Must Read

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ‌పై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదాలు వాడారని ఆరోపించారు. సోనియా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లేవేనని పేర్కొన్నారు.

‘సోనియా గాంధీ వాడిన పదాలు రాష్ట్రపతి స్థాయి, గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అటువంటి వ్యాఖ్యలు పార్లమెంటు సమావేశాల పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.’ అని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. ఈ అంశానికి ఉన్న తీవ్రత దృష్ట్యా.. వీటిని పరిగణనలోకి తీసుకొని సోనియా గాంధీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -