ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో మార్పులు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సంస్కరణల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తాం. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది.’ అని కృతికా శుక్లా వెల్లడించారు