Monday, September 1, 2025

తెలంగాణకు భారీ పెట్టుబడులు

Must Read

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌ ముందుకొచ్చింది. దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది.

మరోవైపు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. పోచారంలో ఇన్ఫోసిస్‌ విస్తరణతో కొత్తగా 17 వేల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఇన్ఫోసిస్ వెల్లడించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -