సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేలు, ఇద్దరి పూచికత్తుపై ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11గా బన్నీని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు 12 గంటల్లోనే మధ్యంతర బెయిల్ వచ్చింది. రాత్రంతా జైలులో ఉండి మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లాడు. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్‌కు తాజాగా కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.