శృంగారంలో ఏ భంగిమ బెస్ట్? భాగస్వామిని తృప్తి పరచాలంటే ఏం చేస్తే కరెక్ట్!
జీవితంలో ప్రేమ, పెళ్లి ఎంత ముఖ్యమో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. జీవితంలో పరిపూర్ణత సాధించాలంటే సెక్సువల్ లైఫ్ను కూడా పూర్తిగా ఆస్వాదించగలగాలి. అందుకే పెద్దలు శృంగారానికి సంబంధించిన అనేక విషయాలు, తమ అనుభవాలు, సూచనలను పంచుకుంటూ ఉంటారు. శృంగారంలో తొలిసారి పాల్గొనే వారిలో చాలామంది భయానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా భాగస్వామిని సంతృప్తి పర్చేందుకు ఏ భంగిమలో సెక్స్ చేయాలనే దానిపై చాలామందిలో స్పష్టత ఉండదు. కాబట్టి సెక్సువల్ లైఫ్తో ముడిపడిన అనేక సందేహాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భంగిమతో పనిలేదు.. మనసే ముఖ్యం
శృంగారం విషయంలో భంగిమల కంటే కూడా మనసు చాలా ముఖ్యమైందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముందు భాగస్వామి మీద మనసు పడాలని, అదే విధంగా స్త్రీలలో జీ-స్పాట్ను స్టిమ్యులేట్ చేయడం ముఖ్యమని చెబుతున్నారు. భంగిమల విషయానికొస్తే.. ఎదురెదురుగా కూర్చొని చేసే పొజిషన్ చాలా బాగుంటుందని సలహా ఇస్తున్నారు. అయితే, రతిలో ఫలానా భంగిమ అంటూ ఒకటే ఏమీ ఉండదని.. ఐదారు రకాల భంగిమల్లో పాల్గొంటూ ఉంటే ఆ మజాను అనుభూతి చెందొచ్చని సూచిస్తున్నారు. సెక్స్ లో పాల్గొన్నప్పుడు వివిధ రకాల భంగిమల్లో పాల్గొంటేనే సుఖం లభిస్తుందని అంటున్నారు.
పురుషాంగం గర్భాశయానికి తగలకపోతే ఏమవుతుంది?
సెక్స్ కు సంబంధించి చాలామందిలో ఉండే అనుమానాల్లో ఇదీ ఒకటి. పురుషాంగం గర్భాశయానికి తగలాలా? అలా తగలకపోతే ఏమవుతుంది? తగిలితేనే స్త్రీకి పూర్తిగా తృప్తి కలుగుతుందా అనే దానిపై హెల్త్ ఎక్స్ పర్ట్స్ వివరణ ఇచ్చారు. పురుషాంగం గర్భాశయానికి ఎప్పటికీ తగలదన్నారు. ఇది దాదాపుగా అసంభవం అన్నారు. గర్భాశయ ముఖద్వారానికి పురుషాంగం తగిలినా ఏమీ కాదని పేర్కొన్నారు. అక్కడ ఉద్రేకం కలిగించే నాడులు ఉండవని.. ఆ చోట ఏ నరాలూ ఉండవని స్పష్టం చేశారు. యోని మార్గంలో రెండు అంగుళాలు దాటిన అనంతరం అసలు ఏ రకమైన కామనాడులూ ఉండవని వివరించారు.
అంగస్తంభనకు అదే కారణం!
సెక్స్ చేసే సమయంలో చాలామంది మగవారిలో అంగం గట్టిపడుతుంది. కానీ కొంతమందిలో మాత్రం అంగం గట్టిపడదు. అయితే ఇలా జరగడానికి పలు కారణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అంగం గట్టిపడకపోతే మాత్రం దానికి ఒత్తిడే ప్రధాన కారణం అని అంటున్నారు. ఒత్తిడిని చిత్తు చేస్తే ఈ సమస్యను జయించొచ్చని సూచిస్తున్నారు.
అంగస్తంభన సమస్యలకు చెక్ పెట్టండిలా..
‘ఒత్తిడిగా ఫీలయితే అంగం పూర్తిగా స్తంభించిపోతుంది. ఎంత ఒత్తిడి ఉంటే అంత ఇబ్బందే. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోయినా అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. అలాగే సరైన ఆహారం తీసుకోకపోయినా, ఎక్సర్ సైజులు చేయకపోయినా ఈ సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి మానసిక ఒత్తిళ్లను పూర్తిగా తగ్గించుకోవాలి. అదే సమయంలో మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ సమయానికి కంటినిండా నిద్రపోవాలి. అలాగే వ్యాయామం చేస్తూ ఉండాలి’ అని డాక్టర్లు పేర్కొన్నారు.